News April 23, 2025

విద్యార్థులకు మల్కాజిగిరి DCP కీలక సూచన

image

పరీక్షల్లో తప్పితే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని మల్కాజిగిరి DCP పద్మజా రెడ్డి హితవు పలికారు. ‘చదువు ఒక్కటే జీవితం కాదు. ఒక భాగ మాత్రమే. లైఫ్‌లో గెలుపోటములు సహజం. పరీక్షల్లో ఫెయిల్, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా మళ్లీ ప్రయత్నించండి. పిల్లల భవిష్యత్తు కోసమే తల్లితండ్రులు కష్టపడుతున్నారు. విద్యార్థులు పట్టుదలతో ముందుకువెళ్లాలి’ అని DCP పద్మజా రెడ్డి మోటివేట్ చేశారు.

Similar News

News April 24, 2025

బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

image

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News April 24, 2025

భారత్ ఆరోపణలు.. పాక్ ప్రధాని రేపు కీలక భేటీ

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని దాయాది దేశంపై భారత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న వేళ దాడులకు పాల్పడినట్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ రేపు నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తెలిపారు. భారత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారన్నారు.

News April 24, 2025

కడప: జిల్లా వ్యాప్తంగా కార్డాన్ అండ్ సర్చ్

image

ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పోలీసులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అల్లర్లకు పాల్పడినా, అల్లర్లకు ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు. ఈ కార్డాన్ అండ్ సర్చ్‌లో రికార్డులు లేని 57 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

error: Content is protected !!