News November 27, 2025

విద్యార్థులకు మెరుగైన బోధన చెయ్యాలి: PDPL కలెక్టర్

image

విద్యార్థులకు మెరుగైన బోధన కోసం చర్యలు చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, ప్రత్యేక తరగతుల నిర్వహణ, పాఠ్యాంశాల విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 85 ఉన్నత పాఠశాలల్లో ఫలితాలను మెరుగుపరిచే విధంగా పర్యవేక్షించాలన్నారు.

Similar News

News November 28, 2025

హనుమకొండ రెడ్ క్రాస్ సర్వసభ్య సమావేశం వాయిదా

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS), హనుమకొండ జిల్లా శాఖకు సంబంధించిన ముఖ్యమైన సర్వ సభ్య సమావేశం వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల కారణంగా, సంస్థ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, డిసెంబర్ 3, 2025 (బుధవారం)న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, సర్వ సభ్య సమావేశం డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామంది.

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు.. త్వరలో ఎగ్జామ్ షెడ్యూల్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 ఖాళీలు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

News November 27, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> రఘునాథ్‌పల్లిలో దొంగల బీభత్సం
> కాంగ్రెస్‌కు ఓట్లతోనే బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే పల్లా
> ఎన్నికల నామినేషన్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్
> కేటీఆర్‌పై కడియం సంచలన వ్యాఖ్యలు
> బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ
> రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన పాలకుర్తి క్రీడాకారులు
> జనగామ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం
> లింగాల ఘనపూర్: పొరపాట్లు లేకుండా చూడాలి: జనరల్ అబ్జర్వర్