News October 24, 2025
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి: అదనపు కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ మండలం శనిగపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్ రూమ్ పరిశీలించారు. విద్యార్థులకు డిజిటల్ పాఠాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 25, 2025
VZM: ఒకేచోట ఆధ్యాత్మికత.. పర్యాటకం

విజయనగరం మండలం సారిక గ్రామంలోని కాళీమాత దేవాలయం, రామబాణం ఆకారంలో ఉన్న రామనారాయణం దేవాలయం పక్కనే ఉండటంతో ఆధ్యాత్మిక సందర్శకుల కేంద్రంగా మారింది. కార్తీక మాసంలో భక్తులు ఒకేసారి రెండు పుణ్య క్షేత్రాలను దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తోంది. దీంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. భక్తులు కాళీమాత ఆశీస్సులు, శ్రీరామచంద్రుడి కృప ఒకే చోట పొందుతున్నారు.
News October 25, 2025
హైదరాబాద్‌లో వర్షపాతం ఇలా..!

గడచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసింది. ఈది బజార్ ప్రాంతంలో 6.8 మి.మీ, సర్దార్ మహల్ 5.5, రియాసత్‌నగర్ 3.8, రూప్‌లాల్ బజార్, డబీర్‌పుర 3.8, బహదూర్‌పుర, యాకుత్‌పుర 3.3, ఖలందర్‌నగర్ 6.5, గోల్కొండ 1.8, అసిఫ్‌నగర్ 3.0, జియాగూడ 1.3, బేగంబజార్, జుమ్మెరాత్ బజార్ 3.8, ముషీరాబాద్‌లో 2.0, హిమాయత్‌నగర్, అంబర్‌పేటలో 1.3 మి.మీల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చిరుజల్లు కురిశాయి.