News December 19, 2025
‘విద్యార్థులకు వరంలా మారిన జేఎన్టీయూ వీసీ ఆలోచనలు’

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం గురువారం M/s. ExcelR Edtechతో MOU ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి జేఎన్టీయూ వీసీ సుదర్శన రావు మాట్లాడుతూ.. ఈ అవగాహన ఒప్పందం వలన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు ఆఫర్ చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్లు సత్యనారాయణ, శోభా బిందు పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
అనంతపురం: ఉద్యోగాలను సొంతం చేసుకోండి..!

అనంతపురంలోని SSBN డిగ్రీ కళాశాలలో ఈనెల 26న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు 10th ఆపై చదివి, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలన్నారు.
News December 22, 2025
అర్జీల పరిష్కారంలో దృష్టి పెట్టాలి: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి 385 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను గడువులోపు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజలు ప్రజా వేదికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 22, 2025
సిద్దరాంపురం వాసికి IESలో ఆల్ ఇండియా 22వ ర్యాంక్

ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన తాల్లూరు హరికృష్ణ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా లెవెల్ 22వ ర్యాంక్ సాధించారు. ఆత్మకూరు మాజీ జడ్పీటీసీ హనుమంతప్ప చౌదరి మనవడైన హరికృష్ణ అత్యుత్తమ ర్యాంక్ సాధించడంపై ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. 2022 నుంచి RWS శాఖలో AEEగా కుప్పంలో విధులు నిర్వహిస్తూ, IES కోసం కష్టపడి తాజాగా 22వ ర్యాంక్ సాధించారు.


