News February 4, 2025

విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించిన పోలీసులు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో రంగంపేట్‌లోని ఓ అకాడమీ విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, ఉమెన్ ట్రాఫికింగ్, వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలపై షీ టీం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Similar News

News February 4, 2025

వరంగల్: రథ సప్తమి.. ఆలయాల్లో పోలీస్ బందోబస్తు

image

రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగర పరిధిలోని ప్రధాన ఆలయాలతో పాటు వెంకటేశ్వస్వామి ఆలయాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భక్తుల తాకిడి అధికంగా ఉండే ఆలయాల్లో మహిళా పోలీస్ సిబ్బందితో పాటు సీసీఎస్, షీ టీం పోలీసులు పరిసరాల్లో ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలని, ఆలయ ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై దృష్టి సారించాలని సూచించారు.

News February 4, 2025

స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

image

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News February 4, 2025

తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

error: Content is protected !!