News December 22, 2025
విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచండి: కలెక్టర్

విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్)ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి వెళ్లాలని కోరారు.
Similar News
News December 23, 2025
కొత్తగూడెం: పంచాయతీ కార్మికుడి మృతి

గుండాలలో పారిశుద్ధ్య కార్మికుడు దేవేందర్ (35) మృతి చెందడం కలకలం రేపింది. సోమవారం కొత్త సర్పంచ్ కోరం సీతారాములు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న దేవేందర్ అనంతరం విగతజీవిగా పడి ఉన్నాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యక్రమాలకు పంచాయతీ కార్మికులను ఎలా తీసుకెళ్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 23, 2025
హైదరాబాద్‌లో కృష్ణా జిల్లా వ్యక్తి గంజాయి దందా

HYD గచ్చిబౌలిలోని ఓ పీజీ హాస్టల్ వేదికగా సాగుతున్న మాదకద్రవ్యాల గుట్టును రాయదుర్గం పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందం రట్టు చేసింది. కృష్ణా (D) పెదపారుపూడికి చెందిన కంభు వంశీ, చీరాల వాసి బాలప్రకాశ్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ముందుగా విజయవాడకు, అక్కడి నుంచి HYDకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు.
News December 23, 2025
1972లో గోపురం పునర్నిర్మాణం…!

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విమాన గోపురం పునర్నిర్మాణం 1972లో జరిగింది. 2018లో టీటీడీ బోర్డు బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయించింది. 100 కిలోల బంగారు, 4300 కిలోల రాగి తో పనులు చేయడానికి తీర్మానించారు. 2023 మే 21 నుంచి 25 వరకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పట్లోనే బంగారు మాయమైందని హిందూ సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి.


