News July 10, 2025

విద్యార్థులతో నంద్యాల కలెక్టర్

image

వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మెగా పీటీఎం’లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్‌ వద్ద విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఫొటోలు దిగారు. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

Similar News

News July 11, 2025

మద్దూర్: పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

image

ఓ మహిళ పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమగ్నాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాలు.. ఈనెల 8వ తేదీన గ్రామానికి చెందిన జోగు మౌనిక ఆర్థిక(35) ఇబ్బందులతో పురుగుమందు తాగింది. చికిత్స కుటుంబసభ్యులు నిమిత్తం HYD నిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈమేరకు కేసు నమోదైంది.

News July 11, 2025

ఏటూరునాగారం: GREAT.. 2 కి.మీ నడిచి వైద్య శిబిరం

image

జ్వరం వస్తే ఆసుపత్రికి రావాలని, సొంత చికిత్సలు చేసుకోవద్దని ఏటూరునాగారం మండలం గంటలకుంట గుత్తికోయలకు వైద్యాధికారి సుమలత సూచించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సుమారు 2 కి.మీ నడిచి హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. క్యాంపులో 28 మందికి పరీక్షలు నిర్వహించి, జ్వరాల బారిన పడ్డ ఐదుగురికి మందులను పంపిణీ చేశామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించినట్లు పేర్కొన్నారు.

News July 11, 2025

రాయపర్తి: తల్లి చెంతకు వచ్చి వెళ్తుండగా అనంత లోకాలకు!

image

తల్లి చెంతకు వచ్చి తిరిగి వెళ్తుండగా కుమారుడు అనంతలోకాలకు వెళ్లిన ఘటన ఆ గ్రామంలో అందరిని కలచివేసింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గాడిపెళ్లి వెంకటయ్య-రజిత దంపతుల కుమారుడు రంజిత్(24) హైదరాబాదులో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో తల్లి గ్రామంలోనే ఉంటోంది. తల్లిని చూసి తిరిగి వెళ్తుండగా పాలకుర్తిలో బస్సు ప్రమాదంలో మృతి చెందాడు.