News March 23, 2025
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: షీ టీం ఎస్ఐ సునంద

మహబూబాబాద్ జిల్లా సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మహిళా ఫార్మసీ కళాశాలలో షీ టీం ఎస్ఐ సునంద పలు విషయాలపై శనివారం అవగాహన కల్పించారు. నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. జాగ్రత్తగా మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
కరీంనగర్: ప్రజావాణిలో సాంకేతిక సమస్య.. ఇబ్బంది పడ్డ అర్జీదారులు

కరీంనగర్ కలెక్టర్ ప్రజావాణిలో సర్వర్ సమస్య తలెత్తడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను విన్నవించేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే, సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల కాస్త ఆలస్యం అయింది. అర్జీదారులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఎండ వేడిమి ఉండడతో కనీసం నీళ్ల సౌకర్యాలు కూడా కల్పించలేదని వాపోయారు. చివరకు సర్వర్ ప్రాబ్లం క్లియర్ అవడంతో అధికారులు అర్జీలు స్వీకరించారు.
News March 24, 2025
‘గ్రూప్-1 మెయిన్స్’పై హైకోర్టులో పిటిషన్

TG: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారని తెలిపారు. 3 భాషల్లో పరీక్ష జరిగితే ఒకే నిపుణుడితో మూల్యాంకనం చేయించడం వల్ల నాణ్యత కొరవడిందని చెప్పారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని TGPSCకి నోటీసులిచ్చింది.
News March 24, 2025
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత

MMTS రైలు <<15866506>>ఘటనపై<<>> MLC కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. మహిళా భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచిస్తున్నా’ అని తెలిపారు.