News August 26, 2025
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా కృషి చేయాలి: కలెక్టర్

విద్యార్థులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రత్యేక అధికారులు, పోలీసులు హాస్టళ్లను తనిఖీ చేస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా నిర్భయంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు.
Similar News
News August 26, 2025
చిత్తూరు ప్రజలకు చవితి శుభాకాంక్షలు: ఎస్పీ

చిత్తూరు జిల్లా ప్రజలకు ఎస్పీ మణికంఠ చందోలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. సామరస్యంతో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే వినాయక చవితిని సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మండప నిర్వాహకులు సూచనలు పాటించాలన్నారు. నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.
News August 26, 2025
అమలాపురం: చేపల వేటకు వెసులుబాటు కల్పించాలని వినతి

ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులకు సముద్రంలో ఎక్కడైనా స్వేచ్ఛగా చేపల వేట చేసుకునే వేసులపాటు కల్పించాలని ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను కలెక్టర్‌కు తెలియజేశారు.
News August 26, 2025
తాళ్లరేవు: స్నేహితుల మధ్య ఘర్షణ.. వ్యక్తి హత్య

తాళ్లరేవు(M) కోరంగి పీఎస్ పరిధిలో మంగళవారం యానాంకిపాలెపు శ్రీను(45) హత్యకు గురయ్యాడు. శ్రీను, అతడి స్నేహితుడికి మధ్య సెల్ఫోన్ విషయంలో మురళీనగర్ వద్ద ఘర్షణ జరిగింది. శ్రీనుని అతని స్నేహితుడు తలపై రాయితో మోది చంపాడు. అనంతరం ఇసుక గుట్టలో మృతుడి తలను కప్పేసి పరారయ్యాడు. గస్తీలో ఉన్న యానాం ఎస్సై పునీత్ రాజ్ కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.