News September 30, 2024
విద్యార్థులు కష్టపడి పోటీపరీక్షల్లో రాణించాలి: గోడం నగేశ్

హైదరాబాద్‌లోని కొమరం భీం స్టడీ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, డా.సిడాం మధుకర్, మేస్రం నాగోరావు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
అతివలకు అండగా షీటీం బృందాలు: ADB SP

అతివలకు షీటీం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల వేధింపులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా డయల్ 100, 8712659953 నెంబర్ కి సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలోని హాట్స్పాట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గత నెలలో రెండు బాల్యవివాహాలు నిలిపివేయడం జరిగిందన్నారు
News November 3, 2025
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ఎస్పీ

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 38 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫోన్ ద్వారా సిబ్బందికి పరిష్కారం చూపాలని ఆదేశాలు ఇచ్చారు.
News November 3, 2025
ADB: మిగిలిన మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజార్షిషా ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం ఆరు దుకాణాల కేటాయింపులు ఈ కార్యక్రమంలో పూర్తయ్యాయి. ఎక్సైజ్ పాలసీ–2025–27 ప్రకారం షాపులకు టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. ప్రక్రియ మొత్తం ఫోటో, వీడియో రికార్డింగ్‌తో పూర్తి పారదర్శకంగా సాగింది.


