News August 21, 2025
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: జడ్జి

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలోని వోక్సాన్ యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలను వివరించారు. అక్రమ మానవ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Similar News
News April 18, 2026
ఉపాధి హామీ పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నాగరాణి

పోడూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భ గుర్రపుడెక్కతో సహజ ఎరువు తయారు చేసే మిషన్‌ను ఆమె ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి హామీ పథకం బలమైన ఆధారమని, ప్రతి కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, అధికారులు పాల్గొన్నారు.
News April 18, 2026
విజయ్ చేతిలో శునకాలు.. ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్

హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడి ఊహాశక్తికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం తన సర్వస్వాన్ని అందిస్తానని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలెజాండ్రో మార్టినెజ్(DOP), హేశమ్ అబ్దుల్ వాహెబ్(మ్యూజిక్), ఎరిక్ డర్స్ట్(VFX)ను పరిచయం చేశారు. హీరో శునకాలను, డైరెక్టర్ గుర్రాన్ని పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
News April 18, 2026
పేరూరు చెరువును పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

చంద్రగిరి నియోజకవర్గంలో నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న “జలధార – జలహారతి” కార్యక్రమంలో భాగంగా పేరూరు చెరువును కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు బైకుపై చెరువు పరిసర ప్రాంతాలు పతిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.


