News December 13, 2025

విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంపొందించాలి: కలెక్టర్

image

రామాపురం మండలంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలను కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థుల నోట్‌బుక్స్‌ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, వారు సరిగా రాస్తున్నారా లేదా అనే అంశంపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Similar News

News December 14, 2025

ములుగు: రెండో విడత ఎన్నికలు.. కాంగ్రెస్‌లో టెన్షన్

image

ఆదివారం జరిగే రెండో విడత ఎన్నికలపై అధికార కాంగ్రెస్‌లో టెన్షన్ మొదలైంది. తొలి అంకంలో మెజార్టీ గ్రామాలను కైవసం చేసుకున్నప్పటికీ ఏటూరునాగారం, తాడ్వాయి చేజారడాన్ని ఆపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గంపెడాశలు పెట్టుకున్న మల్లంపల్లి, పత్తిపల్లి, దేవగిరిపట్నం, జాకారం, అబ్బాపురం, జంగాలపల్లి, వెంకటాపూర్, నల్లగుంట, లక్ష్మీదేవిపేటలో ఫలితంపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

News December 14, 2025

ఈనెల 16న కోదాడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక

image

డిసెంబర్ 25 నుంచి 28 వరకు కరీంనగర్‌లో నిర్వహించే సీనియర్స్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 16న కోదాడలోని కేఆర్‌ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహ రావు తెలిపారు. పూర్తి వివరాలకు 9912381165కు సంప్రదించాలన్నారు.

News December 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 14, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.20 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.01 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.