News December 13, 2025
విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంపొందించాలి: కలెక్టర్

రామాపురం మండలంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలను కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థుల నోట్‌బుక్స్‌ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, వారు సరిగా రాస్తున్నారా లేదా అనే అంశంపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Similar News
News December 14, 2025
WNP: సమస్యలుంటే ఉన్నతాధికారులకు తెలపండి: ఎస్పీ

వనపర్తి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి అలసత్వం లేకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 14, 2025
నెల్లూరులో ఫ్రెండ్‌నే మోసం చేశాడు..!

ఫ్రెండ్‌నే మోసం చేసిన ఘటన ఇది. నెల్లూరులోని ఆచారి వీధికి చెందిన షేక్ అమీర్ అహ్మద్, కోటమిట్టకు చెందిన ఎండీ అర్షద్ అహ్మద్ స్నేహితులు. బంగారం వ్యాపారం చేసే అర్షద్.. ఈ బిజినెస్‌లో పెట్టుబడితే బాగా లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో అర్షద్‌కు అమీర్ రూ.3.55 కోట్లు ఇచ్చాడు. లాభాలు చూపకపోగా నెల్లూరు నుంచి అర్షద్ అదృశ్యమయ్యాడు. మోసపోయానని గ్రహించిన అమీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News December 14, 2025
విశాఖ: ముగిసిన WHIF-2025

3 రోజుల వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం (WHIF)-2025 విశాఖలోని మేడి టెక్ జోన్‌లో శనివారం ముగిసింది. వైద్య సాంకేతిక రంగంలో గ్లోబల్ సహకారం, ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఫోరం పిలుపునిచ్చింది. ఫోరంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఎక్స్‌పో,మెడ్‌టెక్ సిల్క్ రోడ్,స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్,ఆరోగ్య రంగంలో మీడియా పాత్రపై చర్చించారు. 6వేల మందికి పైగా ప్రతినిధులు, 200కిపైగా ప్రసంగకర్తలు,100కిపైగా ఎగ్జిబిటర్లు వచ్చారు.


