News January 28, 2025

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: ASF కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని గోడవెల్లి మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, సరుకుల నిల్వలు,రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య బోధన అందించాలని సూచించారు.

Similar News

News October 18, 2025

సింహాచలం ఆలయ పైకప్పుకు కొత్త అందం

image

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఇప్పుడు కొత్త రూపంలో మెరిసిపోతోంది. ఆలయ ప్రధాన గర్భగృహం, కళ్యాణ మండపం, వ్రత మండపం, వంటశాలకు టెర్రాకోట పెంకులతో కొత్త పైకప్పు ఏర్పాటు చేశారు. పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర చారిటబుల్ అండ్ రీలిజియస్ ట్రస్ట్ సుమారు రూ.5 కోట్లతో ఈ మరమ్మతులు చేపట్టింది. పాత పద్ధతిలోనే పైకప్పును పునరుద్ధరించి, శిల్పకళా అందాన్ని కాపాడుతూ ఆలయానికి నూతన శోభను చేకూర్చింది.

News October 18, 2025

MBNR: BC బంద్.. PU పరీక్షలు వాయిదా

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో బీసీ బంద్ కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగవలసిన పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు Way2Newsతో తెలిపారు. ఈ మేరకు సెమిస్టర్–IV, B-ఫార్మసీ సెమిస్టర్–II పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ కారణంగా వాయిదా వేసిన పరీక్షల తేదీలను, సమయాన్ని త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు.

News October 18, 2025

వైకల్య ధ్రువీకరణకు కేంద్రం కొత్త రూల్స్

image

వైకల్య ధ్రువీకరణకు సవరించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను కేంద్రం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అభ్యర్థులు సమర్పించే సర్టిఫికేట్స్ పరిశీలనలో ఈ రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. ప్రతి సర్టిఫికేట్‌ను, యునిక్ డిజబిలిటీ ఐడీ కార్డును జాతీయ పోర్టల్‌లో చెక్ చేయాలని ఆదేశించింది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌తో ఆయా సంస్థలు అనుసంధానం చేసుకోవాలని సూచించింది.