News October 23, 2025

విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు: ఐటీడీఏ పీవో

image

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. ఐటీడీఏలో బుధవారం ఏటీడబ్ల్యూవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యం, హాజరుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. విద్యార్ధులకు అనారోగ్య, ఇతర సమస్యలు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దాచిపెట్టవద్దని, అధికారులకు సమాచారం అందించాలన్నారు.

Similar News

News October 23, 2025

వరుసగా డకౌట్లు.. కోహ్లీ కెరీర్‌లో తొలిసారి

image

లాంగ్ గ్యాప్ తర్వాత వన్డే సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఫెయిల్ అవుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యారు. తన కెరీర్‌లో ఇలా వరుస ODIల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. దీంతో విరాట్‌కు ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రన్ మెషీన్ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నారు.

News October 23, 2025

రాష్ట్రానికి తుఫాను/వాయుగుండం ముప్పు?

image

AP: అక్టోబర్ 27 నుంచి 30 మధ్యలో తుఫాను లేదా వాయుగుండం కావలి-మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

News October 23, 2025

మాడుగుల: కార్తీక మాసంలో పిక్నిక్ స్పాట్ ఇది!

image

మాడుగులకు 3కి.మీ దూరంలో ఉన్న శ్రీఉబ్బలింగేశ్వర ఆలయం కార్తీక మాసంలో మంచి పిక్నిక్ స్పాట్‌గా గుర్తింపు పొందింది. చుట్టు ఎత్తైన కొండలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంది. కార్తీకమాసంలో ఎక్కువ మంది భక్తులు స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ వనభోజనాలు చేస్తుంటారు. ఈ ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఈశ్వరుని విగ్రహం, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతంలో సినిమా, సీరియల్స్ షూటింగులు జరిగాయి.