News August 5, 2025

విద్యార్థుల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: ఐటీడీఏ పీఓ

image

విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్
సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల ప్రిన్సిపల్, హెచ్ఎం, వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్లూరు ఎస్టీ బాలికల హాస్టల్‌లో జరిగిన పరిణామాలు హెచ్చరికగా భావించి ఇకముందు ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.

Similar News

News August 6, 2025

ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రూప్స్, RRB, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా 4 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి.పురంధర్ తెలిపారు. దరఖాస్తులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News August 6, 2025

ఖమ్మంలో రేపటి నుంచి సదరం క్యాంపులు

image

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 7 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. సదరం క్యాంపులకు దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 7, 12, 14, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన దివ్యాంగులు మెడికల్ రిపోర్టులు, పాస్ ఫొటో, స్లాట్ బుకింగ్ స్లిప్‌తో హాజరు కావాలని సూచించారు.

News August 6, 2025

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ జిల్లాలో నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ మున్నేరు వరద తీవ్రతపై నేడు ఖమ్మం కమిషనర్ సమీక్ష
☆ జిల్లాలో పర్యటించనున్న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు
☆ జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న ఫీవర్ సర్వే
☆ బోనకల్‌లో నేడు రేషన్ కార్డుల పంపిణీ
☆ ఖమ్మం రూరల్: మారెమ్మ తల్లి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ జిల్లాలో వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.