News January 6, 2026

విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమంపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో 75శాతం మంది విద్యార్థులు అనర్గళంగా చదివేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. రెండో దశను 45 రోజుల పాటు సమర్థవంతంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఫొనెటిక్స్ పద్ధతిలో పదాలను నేర్పించాలని సూచించారు. మొదటి దశలో మంచి ఫలితాలు వచ్చాయని, అదే ఉత్సాహంతో పిల్లల్లో అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపరచాలని కోరారు.

Similar News

News January 27, 2026

ఎదులాపురం మున్సిపల్‌ బరిలో బీజేపీ

image

మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకుడు శాసనాల శ్రీరామ్ వెల్లడించారు. మంగళవారం ఎదులాపురంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News January 27, 2026

ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు లేవు..!

image

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ గడువు ఏప్రిల్ వరకు ఉన్నందున, ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగటం లేదు. కేవలం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌కు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11న పోలింగ్, 13 ఫలితాలు వెల్లడవుతాయి.

News January 27, 2026

ఖమ్మం: ఏకలవ్య గురుకులాల్లో అడ్మిషన్స్ ఓపెన్

image

ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు RCO అరుణకుమారి తెలిపారు. CBSE సిలబస్‌‌లో బోధన ఉంటుందన్నారు. భద్రాద్రిలోని ములకలపల్లి, గండుగులపల్లి, గుండాల, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, టేకులపల్లితో ఖమ్మంలోని సింగరేణి పాఠశాలలో 480 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవాలని, మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.