News March 18, 2024

విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి: డీఈవో

image

జాతీయ ఉపకార వేతనం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికైన విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో కోరారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాలలో స్కాలర్ షిప్ నకు ఎంపికై ప్రస్తుతం 9 నుంచి ఇంటర్ చదువుతూ రెన్యూవల్ చేయించుకున్న ప్రతి విద్యార్థి తప్పకుండా తమ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని తెలిపారు.

Similar News

News July 5, 2024

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్

image

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ విచారణకు ఆదేశించారు. దీంతో మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో విచారణ జరిపిన అనంతరం ఆ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు.

News July 5, 2024

చీమకుర్తి : నూడుల్స్ తింటూ వ్యక్తి మృతి

image

చీమకుర్తిలోని ఓ రెస్టారెంటులో గురువారం రాత్రి నాగశేషులు అనే వ్యక్తి మృతి చెందాడు. రాత్రి 9 గంటల సమయంలో నాగశేషులు పట్టణంలోని ఓ రెస్టారెంట్‌కి వచ్చి నూడుల్స్ ఆర్డర్ చేసి కొంత వరకు తిన్నాడు. తింటుండగానే కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం ఆత్మకూరుగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట

image

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.