News January 2, 2025

విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. బుధవారం టీఎస్‌యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజ నిర్మాణం తరగతి గదిలోనే ప్రారంభమవుతుందన్నారు. సామాజిక స్పృహ కలిగిన సంఘంగా కొత్త ఏడాదిలో నవ ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు.

Similar News

News January 4, 2025

కడెం: రేపు సాగు నీటిని విడుదల చేయనున్న ఎమ్మెల్యే

image

ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్మాట్, కడెం ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని రైతుల పొలాలకు ఎమ్మెల్యే బొజ్జు సాగునీటిని విడుదల చేయనున్నారని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. రబీ సీజన్‌కు సంబంధించి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న రైతుల పొలాల్లో వేసే పంటల కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదివారం ఉదయం 10 గంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారని వారు వెల్లడించారు. విషయాన్ని రైతులు, అందరూ గమనించాలని వారు సూచించారు.

News January 4, 2025

భీంపూర్: 3 ఆవులను చంపిన పెద్దపులి

image

పెద్దపులి దాడిలో 3 ఆవులు మృతి చెందిన ఘటన భీంపూర్‌లో చోటుచేసుకుంది. మండలంలోని పిప్పల్ కోటి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో శుక్రవారం మేతకు వెళ్లిన 3 ఆవులపై పులి దాడి చేసి చంపేయగా మరో 3 తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతులు పంట చేలకు వెళ్లాలంటే జంకుతున్నారు.

News January 4, 2025

మందమర్రి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

మందమర్రి మండలం పులిమడుగు ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. మంచిర్యాల ర్యాలీగడ్‌పూర్‌కు చెందిన రాజు(24) భీమిని మండలంలోని భీంపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకొని చనిపోయినట్లు చెప్పారు.