News September 19, 2025
విద్యార్థుల విద్యాభివృద్ధిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలి: పీవో

సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న పాఠశాలు, ఆశ్రమ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో పవర్ స్వప్నల్ జగన్నాథం అన్నారు. శుక్రవారం సీతంపేట ఐటీడీఏలో ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్స్, వార్డెన్‌లతో పీవో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని, పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పీవో సూచించారు.
Similar News
News September 19, 2025
ఆధార్ నమోదు లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో 192 ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, అన్ని కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. 0-5 ఏళ్ల పిల్లలకు ఆధార్ నమోదు, 5-7 ఏళ్ల వారికి వేలిముద్రలు, 15-17 ఏళ్ల వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని ఆదేశించారు. ‘తల్లికి వందనం’ వంటి పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు.
News September 19, 2025
ఏలూరు: కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన పద్మశ్రీ

ఏలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా చైర్ పర్సన్ పద్మశ్రీ శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. పంచాయతీ రాజ్ శాఖ, పారిశుద్ధ్య శాఖ, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయని గుర్తించినట్లు పద్మశ్రీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వాసుపత్రికి వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.
News September 19, 2025
జగిత్యాల: సైబర్ నేరాలపై ఎస్పీ సమీక్ష

జగిత్యాల జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన సైబర్ నేరాల సంఖ్య, కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల పట్టివేత, బాధితులకు అందిస్తున్న సహాయ చర్యలపై ఆయన చర్చించారు. సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, ప్రతి పోలీస్ అధికారి సైబర్ నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.