News August 15, 2025
విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ కృషి: ఎంపీ

కర్నూలు మండలం పంచలింగాలలో పలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
Similar News
News August 15, 2025
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం: మంత్రి

జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేద్దామని మంత్రి టీజీ భరత్ అన్నారు. 79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కర్నూలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీతో కలిసి జాతీయ జెండాని ఎగరేశారు. అనంతరం వివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
News August 15, 2025
కర్నూలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు

79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర నేటి యువతరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
News August 15, 2025
కర్నూలు జిల్లాలో 276 బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. స్త్రీ శక్తి పథకాన్ని నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లాలో 186 పల్లె వెలుగు, 2 అల్ట్రా పల్లె వెలుగు, 82 ఎక్స్‌ప్రెస్ బస్సులను ఉచిత ప్రయాణం కోసం ఉపయోగిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 390 బస్సులకు గానూ 276 ఉచిత బస్సులకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.