News January 23, 2025
విద్యార్థుల సహాయ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

గురుకులాల్లోని సీట్ల ప్రవేశానికి విద్యార్థుల సహాయార్థం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఇక్కడ విద్యను పొందితే ఉన్నతంగా రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News December 26, 2025
రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ

TGలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’ ఖండించింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని తేల్చిచెప్పింది. ప్రస్తుతం లబ్ధిదారులకు మాత్రమే సాయం అందేలా గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, సర్కార్ ఎలాంటి షరతులు విధించలేదని స్పష్టం చేసింది.
News December 26, 2025
ఏలూరు: ఆపదొస్తే ఈ నంబర్లతో రక్షణ

బాల్యం నుంచే ధృడమైన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విద్యార్థులకు సూచించారు. వట్లూరులోని పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘వీర్ బాల దివస్’లో ఆమె పాల్గొన్నారు. ర్యాగింగ్, అఘాయిత్యాల నిరోధానికి 1098, గృహ హింస నుంచి రక్షణకు 181 హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయం రక్షణ చర్యలపై ఆమె అవగాహన కల్పించారు.
News December 26, 2025
‘మెంతో ప్లస్’ డబ్బా మింగిన పసివాడు.. ప్రాణం కాపాడిన GGH వైద్యులు

కాకినాడ GGHలో 8 నెలల బాలుడు ప్రమాదవశాత్తు ‘మెంతో ప్లస్’ డబ్బాను మింగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రుల వద్ద ఉన్న బాలుడు దీనిని మింగగా, అటెండర్ వెంటనే గుర్తించారు. సీఎంఓ డాక్టర్ సుష్మ ఆధ్వర్యంలో వైద్య బృందం అప్రమత్తమై, అత్యవసరంగా డబ్బాను బయటకు తీసి బాలుడిని కాపాడారు. సకాలంలో స్పందించి ప్రాణదాతలుగా నిలిచిన వైద్యులను రోగులు, బాలుడి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా అభినందించారు.


