News November 22, 2025

విద్యార్థుల సృజనాత్మకతకు అటల్‌ ల్యాబ్‌లు కీలకం: డీఈవో

image

అమలాపురం మండలం పేరూరు జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మూడు రోజుల అటల్‌ ల్యాబ్‌ ఉపాధ్యాయుల వర్క్‌షాప్‌ శుక్రవారంతో ముగిసింది. డీఈవో సలీం బాషా, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని కొత్త ఆలోచనలకు ఈ ల్యాబ్‌లు వేదికగా మారాలని ఆకాంక్షించారు. ల్యాబ్‌ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డీఈవో ఉపాధ్యాయులను హెచ్చరించారు.

Similar News

News November 23, 2025

కల్కి ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు?

image

విష్ణువు ‘కల్కి’ అవతారంలో కలియుగం చివరిలో అవతరిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో ఇప్పటికే దాదాపు 5 వేల సంవత్సరాలు పూర్తయ్యాయి. కల్కి అవతారం సుమారు 4,27,000 సంవత్సరాల తర్వాత వస్తాడని కొందరు నమ్ముతారు. UPలోని శంభల గ్రామంలో జన్మిస్తాడని భవిష్యవాణిలో ఉంది. ధర్మ సంస్థాపన కోసం తన ఖడ్గంతో అందరికీ సమాధానం చెబుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

News November 23, 2025

ఖమ్మం: ఓయూ చరిత్రలో తొలి ఆదివాసి పరిశోధకుడు

image

ఏన్కూరు మండలం కేసుపల్లికి చెందిన సాగబోయిన పాపారావు తొలి ఆదివాసి పరిశోధక విద్యార్థిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఓయూ సోషియాలజీ విభాగం నుంచి ఆయన ఈ గుర్తింపు పొందారు. ప్రొఫెసర్ పి. విష్ణుదేవ్ పర్యవేక్షణలో ‘ఐటీడీఏ భద్రాచలం గిరిజన అభివృద్ధిపై సామాజిక అధ్యయనం’ అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. ఓయూ కంట్రోలర్ ఆయన్ను తొలి ఆదివాసి పరిశోధకుడిగా ప్రకటించారు.

News November 23, 2025

‘కాళేశ్వరం’ బ్యారేజీల పునరుద్ధరణ.. DEC 5 నాటికి డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక

image

TG: ఈ నెల 26కల్లా ప్రాధాన్య ప్రాజెక్టుల స్టేటస్‌పై వివరాలు సమర్పించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్ కన్సల్టెంట్ ఎంపికను వచ్చే నెల 5 నాటికి పూర్తి చేయాలని సూచించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ఏ ఎత్తుతో నిర్మిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో అధ్యయనం జరపాలని, డీపీఆర్ తయారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.