News February 17, 2025

విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్ 

image

10వ తరగతి పరీక్షల విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం, కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. 

Similar News

News February 20, 2025

గుంటూరు: ఎమ్మెల్సీ ఓటును చెక్ చేసుకోండి ఇలా..

image

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదైన వ్యక్తులు తమ ఓటు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా <>https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html<<>> లింక్‌ను ఓపెన్ చేయాలి. రైట్ సైడ్‌లో MLC Registration 2024ను క్లిక్ చేస్తే 4 ఆప్షన్లు వస్తాయి. అందులో Search Your Name క్లిక్ చేసిన తర్వాత గ్రాడ్యుయేట్ కృష్ణా/గుంటూరు క్లిక్ చేసి Application ID/Name/ ఇంటి నంబర్ మూడింటిలో ఒకటి ఎంచుకుంటే పూర్తి వివరాలు వస్తాయి.

News February 20, 2025

బ్యాలెట్ బాక్స్‌లను సక్రమంగా భధ్రపరచాలి: కలెక్టర్ 

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలో సక్రమంగా భద్రపరచాలని గుంటూరు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికలకు విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్‌లు తీసుకునేటప్పుడు సీల్ పూర్తి స్థాయిలో వేసారా లేదా తనిఖీ చేసి బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు.

News February 19, 2025

జీబీఎస్‌తో గుంటూరు మహిళ మృతి

image

గిలియన్ బారో సిండ్రోమ్ (GBS)తో గుంటూరు నెహ్రూనగర్‌కి చెందిన మహిళ మరణించారు. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతూ గత కొద్దిరోజుల క్రితం నెహ్రూనగర్‌కి చెందిన గౌర్ జాన్ (65) జీజీహెచ్‌లో చేరారు. మొదటి మరణం సంభవించినప్పుడు జీబీఎస్ అంత ప్రమాదం ఏమీ కాదని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి చెప్పారు. కానీ ఇప్పుడు నగరానికి చెందిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో గుంటూరు నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

error: Content is protected !!