News December 10, 2025
విద్యావ్యాప్తితో జిల్లా పేరును నిలపాలి: కలెక్టర్

విద్యావ్యాప్తి ద్వారా జిల్లా పేరు ప్రఖ్యాతులను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, విద్యాశాఖ అధికారి పడాల నాగేశ్వరరావుకు సూచించారు. బుధవారం ఇన్‌ఛార్జి DEOగా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ DEOకు పలు సూచనలు చేశారు. జిల్లా విద్యావ్యవస్థకు దార్శనిక నాయకత్వం వహించి దిక్సూచిలా పనిచేయాలని ఆయన సూచించారు.
Similar News
News December 14, 2025
నెల్లూరులో ఎత్తులకు పైఎత్తులు.. మేయర్ ట్విస్ట్!

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కిడ్నాప్, బెదిరింపులకు దారి తీసింది. TDP, YCP నాయకులు పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలనే ఉద్దేశంతో TDP నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కొందరికి డబ్బులు ఆఫర్ చేసినట్లు సమాచారం. మేయర్ పీఠం కోసం ఇలా రెండు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే రాజీనామాతో స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఉండదని తెలుస్తోంది.
News December 14, 2025
పాక్‌తో మ్యాచ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

మెన్స్ U19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయిలో భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. కాసేపట్లో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆరంభించనుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.
IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్
News December 14, 2025
SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.


