News November 6, 2024
విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలి: గుంటూరు ఎస్పీ

క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో శాంతిభద్రత సమస్యలను పరిష్కరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ని ఎస్పీ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరను స్వయంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదిదారుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని, పెండింగ్ వాహనాలను త్వరగా డిస్పోస్ చేయాలని ఆదేశించారు.
Similar News
News September 15, 2025
గుంటూరు: DSC-2025 రిక్రూట్మెంట్ జాబితా చెక్ చేస్కోండి

గుంటూరు జిల్లాలో మెగా డీఎస్సీ-2025 కి సంబంధించిన అన్ని కేటగిరీల రిక్రూట్‌మెంట్ జాబితాను deognt.blogspot.com వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. ఈ జాబితాను డీఈవో కార్యాలయం, కలెక్టరేట్‌లోని డిస్‌ప్లే బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.
News September 15, 2025
మహిళల ఆరోగ్యంపై శిబిరాలు: DMHO

‘స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్’ పేరిట జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ శిబిరాలలో మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, గర్భాశయ క్యాన్సర్, రక్తహీనత వంటి వ్యాధులను గుర్తించి, చికిత్సలు అందిస్తారు. గర్భిణులకు పరీక్షలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
News September 15, 2025
సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ వకుల్

పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.