News July 5, 2025
విద్యా కిట్లు వెంటనే అందించాలి: పద్మశ్రీ

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య, సరైన వసతులు, సరైన ఆహారం, అవసరమైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జిల్లా పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ పద్మశ్రీ అన్నారు. శనివారం ఏలూరులో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యా కిట్ల పంపిణీ కొన్ని మండలాల్లో ఆలస్యం అయినట్లు గుర్తించామన్నారు. కిట్స్ వెంటనే అందించాలన్నారు.
Similar News
News July 6, 2025
జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్ కుమార్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.
News July 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News July 6, 2025
నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.