News January 6, 2026

విద్యా వ్యవస్థలో మార్పులతోనే ఉద్యోగాలు!

image

విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక మళ్లీ కోచింగ్ <<18774837>>సెంటర్ల<<>> చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా ‘నైపుణ్యాధారిత విద్య’ను అందించాలి. సిలబస్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. క్యాంపస్ నుంచే విద్యార్థులు జాబ్స్ సాధించేలా స్కిల్స్ పెరిగితేనే విద్యా వ్యవస్థ సక్సెస్ అయినట్లు. ఏమంటారు?

Similar News

News February 6, 2026

తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

image

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

News February 6, 2026

260 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>కొచ్చిన్<<>> షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL)లో 260 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపు ఆఖరు తేదీ కాగా.. FEB 16వరకు పొడిగించారు. పోస్టును బట్టి టెన్త్, ITI, NTCతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.23,300 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in

News February 6, 2026

కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒక్కటే: పవన్ కళ్యాణ్

image

AP: ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని, హిందూ దేవుళ్లను అవమానిస్తే మౌనం వీడాలని డిప్యూటీ CM పవన్ పిలుపునిచ్చారు. కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒక్కటేనన్నారు. ‘ఎవరి కర్మకు వారిని వదిలేసే పద్ధతి మారాలి. మన ధర్మాన్ని అవమానిస్తే పోరాడాల్సింది మనమే. భక్తులుగానే కాదు.. ధర్మ రక్షకులుగా మారాలి. హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. మన విశ్వాసాలను కాపాడుకోవడమే’ అని SMలో పేర్కొన్నారు.