News October 27, 2025
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎండీ

తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హన్మకొండలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 27, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి: భద్రాద్రి కలెక్టర్

తెలంగాణ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సమర్థవంతంగా కొనుగోలు కొనసాగుతున్నదని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
News October 27, 2025
ప్రజావాణికి 112 దరఖాస్తులు: HNK కలెక్టర్

HNK కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై.వి.గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డా.నారాయణ, జిల్లా అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
News October 27, 2025
రేపు జరగాల్సిన పోలీస్ సైకిల్ ర్యాలీ 29కి వాయిదా

శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రేపు నిర్వహించాల్సిన సైకిల్ ర్యాలీ అనివార్య కారణాలతో 29కి వాయిదా వేస్తున్నట్లు సీపీ తెలిపారు. కార్యాలయం నుంచి ప్రారంభం అయ్యే ఈ సైకిల్ ర్యాలీ యువతీ, యువకులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కోరారు.


