News December 26, 2025
విద్యుత్ కష్టాలకు చెక్.. అయినవిల్లిలో భారీ సబ్‌స్టేషన్!

జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అయినవిల్లిలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్‌స్టేషన్ మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లో-వోల్టేజ్ సమస్యలను అధిగమించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును జిల్లాకే తలమానికంగా చేపడుతున్నట్లు తెలిపారు.
Similar News
News December 31, 2025
NZB: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. చికెన్, ఫిష్ మార్కెట్‌లో రష్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. 2026కు స్వాగతం పలికేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. దీంతో బుధవారం నిజామాబాద్ జిల్లాలోని చికెన్, ఫిష్ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. డిమాండ్‌కు అనుగుణంగా చేపల ధరలు సాధారణం కంటే అధికంగా పలికాయి. అయినప్పటికీ పండుగ జోష్‌లో ప్రజలు కొనుగోలుకు వెనుకాడలేదు. మీ ప్రాంతంలో కొత్త ఏడాది వేడుకల సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి.
News December 31, 2025
వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట.. ₹87,695 కోట్ల బకాయిలు ఫ్రీజ్!

వొడాఫోన్ ఐడియా (Vi)కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కంపెనీ చెల్లించాల్సిన ₹87,695 కోట్ల AGR బకాయిలను ప్రస్తుతానికి నిలిపివేస్తూ ఐదేళ్ల పాటు మారటోరియం ప్రకటించింది. ఈ బకాయిలను 2031 నుంచి పదేళ్ల కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. టెలికం రంగంలో పోటీని కాపాడటానికి 20 కోట్ల మంది కస్టమర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీ ఆర్థిక కష్టాల నుంచి కోలుకునే అవకాశం ఉంది.
News December 31, 2025
కడప: 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

కడప జిల్లా టి.సిండుపల్లి మండలం రాయవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉపాధ్యాయులు వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని వైద్యులతో మాట్లాడుతున్నారు.


