News February 23, 2025

విద్యుత్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఎన్నిక

image

విద్యుత్ కార్మిక సంఘం మెదక్ జిల్లా నూతన గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సెక్రటరీ ఓరం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తనను గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వం, కంపెనీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

Similar News

News February 24, 2025

మెదక్: నేడు హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 24 సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వినతులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.

News February 23, 2025

సిద్దిపేట: తెల్లారితే పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

image

అంతా హడావుడి.. తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి ఉండగా ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆనందం పట్ట లేకనో ఏమో తెలియదు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక మండలం రామక్కపేటలో జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం కొడుకు శ్రీనివాస్ వివాహం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉండగా.. శనివారం ఆయన గుండెపోటుతో మృతి చెందారు.

News February 23, 2025

మెదక్: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

error: Content is protected !!