News August 20, 2025

విద్యుత్ కోతలు లేకుండా చూడాలి: కలెక్టర్

image

కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున, సిబ్బంది ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పనులు సాగుతున్న గ్రామాలలో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు.

Similar News

News August 20, 2025

నేడు ఒంగోలుకు వందేమాతరం శ్రీనివాస్

image

ఒంగోలులో నేటి నుంచి 24 వరకు కళా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్ తెలిపారు. మంగళవారం ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్ ఆవరణంలో కళా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను వారు విడుదల చేశారు. బుధవారం కళా ఉత్సవాల ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న, తమ్మారెడ్డి భరద్వాజ, ఏపూరి సోమన్న పలువురు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.

News August 20, 2025

డ్వాక్రా నగదు 75% ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి: కలెక్టర్

image

డ్వాక్రా సంఘాల మహిళలు చేస్తున్న పొదుపు డబ్బుల్లో 75% ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, మిగిలిన 25% డబ్బులను అంతర్గత రుణాలకు ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం బ్యాంకర్లకు సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డీఆర్డీఏలోని పొదుపు సంఘాల మహిళలకు రుణాల మంజూరుపై బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మైక్రో క్రెడిట్ ప్లాన్స్‌ను త్వరితగతిన ఆమోదించాలని కలెక్టర్ అన్నారు.

News August 20, 2025

ఎంపీడీవోలు సచివాలయాలను తనిఖీ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి ఎంపీడీవో వారానికి 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఎంపీడీవోలదే అన్నారు. జిల్లాలో క్లాప్ మిత్రా జీతాల సమస్య పరిష్కరించాలన్నారు.