News January 13, 2026
విద్యుత్ చార్జీలపై అభిప్రాయ సేకరణ.. ఎప్పుడంటే?

2026-27 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్‌పై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ రాజేశ్వరి మంగళవారం తెలిపారు. ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ పి.వి.ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. డిస్కంలు సమర్పించిన చార్జీల ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాలను అమలాపురం ఎస్‌ఈ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 18, 2026
ఫాల్గుణ మాసం: ఈ వ్రతం చేస్తే ఎంతో పుణ్యం

ఫాల్గుణ మాసంలో వయో వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్నే ‘సర్వయజ్ఞ ఫలప్రదం’ అంటారు. అదితి దేవి తన కుమారులైన దేవతలకు తిరిగి స్వర్గరాజ్యం లభించాలని ఈ వ్రతాన్ని ఆచరించిందట. అలా వామనుడిని పుత్రుడిగా పొందిందని పురాణ గాథ. కోరిన కోరికలు నెరవేరడానికి, సంతాన ప్రాప్తికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, కష్టాల నుంచి విముక్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.
News February 18, 2026
మలైకా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

50ఏళ్లు దాటినా ఇంకా ఫిట్ & యంగ్‌గా కనిపిస్తుంటారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఆమె టోన్డ్ బాడీ, ఫ్లాట్ యాబ్స్, గ్లోయింగ్ స్కిన్ చూస్తే యూత్ కూడా జలసీ ఫీల్ అవ్వాల్సిందే. దీనికోసం యోగాతో పాటు హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) చేస్తానని మలైకా ఓ ఇంటర్వూలో వెల్లడించారు. వీటితో పాటు పైలేట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫుల్-బాడీ వర్కౌట్‌లతో సహా వివిధ రకాల వ్యాయామాలను చేయడానికి ఇష్టపడతానని తెలిపారు.
News February 18, 2026
సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా

AP: శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈరోజు సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ వైసీపీ MLCలు నిరసనకు దిగారు. ఆందోళనల మధ్య ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు దేవుడిపై రాజకీయాలు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించగా, ప్రభుత్వమే శ్రీవారిపై రాజకీయాలు చేస్తోందని YCP పక్షనేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.


