News December 23, 2025
విద్యుత్ ఛార్జీలు తగ్గించండి… ఇరిగేషన్ శాఖ లేఖ

TG: ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరఫరా అయ్యే విద్యుత్‌పై అదనపు ఛార్జీలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. నెలకు KVAకు ₹300 చొప్పున వసూలు చేయడాన్ని ఆపాలంది. యూనిట్ విద్యుత్‌కు వసూలు చేస్తున్న ₹6.30 సుంకాన్నీ తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్లకు సరఫరా అవుతున్న విద్యుత్ లోడ్ 2819.80 MWగా ఉంది. 2026లో ఇది 7348 MWకు చేరుతుందని అంచనా.
Similar News
News December 24, 2025
మహిళలపై ఇన్ఫ్లమేషన్ ప్రభావం

ఇన్‌ఫ్లమేషన్ అంటే సాధారణ భాషలో వాపు అని అర్థం. క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి అనేక వ్యాధులకు ఇది కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల్లో జననాంగ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఫైబ్రాయిడ్లు, జీర్ణ సమస్యలు, చర్మసమస్యలు వంటివి వస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గాలంటే స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 24, 2025
BMRCLలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 24, 2025
అసెంబ్లీకి రావచ్చు కదా సార్!

TG: ప్రతిపక్ష నేతగా KCR అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే చూడాలని చాలా మంది రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. నదీ జలాల వ్యవహారాలు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై చర్చిద్దామని, ఆయన సలహాలు ఇస్తే స్వీకరిస్తామని CM రేవంత్, మంత్రులు అంటున్నారు. మరోవైపు ‘ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’ అని KCR, KTR ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కానీ KCR <<18643502>>అసెంబ్లీకి<<>> వస్తారా అనేది ఇంకా ప్రశ్నార్థకమే.


