News January 24, 2026
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి

AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే యూనిట్‌కు 13 పైసలు ట్రూ డౌన్ చేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో యూనిట్‌పై రూ.1.19 తగ్గించి రూ.4కే ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.19 ఉండేదని, అందులో 29 పైసలు తగ్గించామని చెప్పారు. మరో 90 పైసలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
Similar News
News February 3, 2026
ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్

ఆసీస్ స్టార్ పేసర్, SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. మార్చి 26 నుంచి జరిగే IPL సీజన్‌కు తాను ఫిట్‌గా ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశారు ప్యాట్. జట్టులో చేరేదీ, లేనిదీ తన వెన్నునొప్పిపై ఆధారపడి ఉంటుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని వారాల్లో జరిగే స్కాన్ ఫలితాలు బావుంటే ట్రైనింగ్‌లో పాల్గొంటానని ఆయన చెప్పారు. దీంతో SRH ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది.
News February 3, 2026
మున్సి‘పోల్స్’: ప్రచార బరిలోకి ముఖ్యనేతలు

TG: పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగుతుండడంతో మున్సి‘పోల్స్’ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. CM రేవంత్ మిర్యాలగూడలో రేపు తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. FEB 9 వరకు CM రోజుకో సభలో ప్రచారం చేస్తారు. ఇక ప్రచారాలను హోరెత్తించేలా BRS కదులుతోంది. KTR, హరీశ్ రావు పలు ర్యాలీలు, సభలు నిర్వహించనునున్నారు. అటు BJP తమకు పట్టున్న ఉత్తర TGపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ నాయకులు, MP, MLAలను రంగంలోకి దించుతోంది.
News February 3, 2026
హెయిర్ గ్రోత్‌కి గుడ్డు పెంకుల మాస్క్

కోడిగుడ్డు పెంకులను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం బావుంటుందని నిపుణులు చెబుతున్నారు. కోడి పెంకులను మెత్తటి పొడిలా చేసి కొబ్బరి నూనెలో కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. వారానికోసారి ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది. ఆలివ్ నూనెలో ఒక స్పూన్ పెంకుల పొడి కలిపి తలకు పట్టించాలి. తర్వాత తలస్నానం చెయ్యాలి. గుడ్డు పెంకులోని పోషకాలు చుండ్రు, దురదను తగ్గిస్తాయి.


