News February 11, 2026
విద్యుత్ శాఖలో అతిత్వరలో నియామకాలు: గొట్టిపాటి

AP: విద్యుత్ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు అతి త్వరలోనే నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లలో 90 శాతానికి పైగా పరిష్కరించామన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయులు పెరిగేలా విధులు నిర్వర్తించాలని బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో తెలిపారు. మెడికల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి సమస్యలుంటే పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
Similar News
News February 12, 2026
ఇవాళ దేశవ్యాప్తంగా బంద్

కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు కార్మిక సంఘాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్‌లు తమ హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెడుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లు మద్దతు తెలపడంతో బ్యాంకింగ్ సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగే అవకాశం ఉంది. స్కూళ్లు యథావిధిగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.


