News July 8, 2025

విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి

image

పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి కౌలు రైతు మృతి చెందిన ఘటన కొల్లూరులో మంగళవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు కొల్లూరుకు చెందిన రైతు పత్తిపాటి శ్రీనివాసరావు(53) వరి పంటకు నీళ్లు పెట్టడానికి విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. 108లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

Similar News

News July 8, 2025

కళాశాలల వద్ద ఆకస్మిక తనిఖీలు – గుట్కా స్వాధీనం

image

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కాలేజీలు, స్కూల్స్‌ చుట్టూ “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీపీ ఆదేశాల మేరకు పలు పాన్ షాపులు, బడ్డీ కొట్లు వద్ద ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమతులు లేని గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశారు. దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

News July 8, 2025

మహబూబాబాద్: BRSకు డిపాజిట్ దక్కదు: డిప్యూటీ సీఎం

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSకు డిపాజిట్ దక్కదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం MHBDలో ఆయన మాట్లాడారు. కృష్ణ, గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు CM రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీకి KCR చర్చకు రావాలన్నారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, కృష్ణ, గోదావరి నీళ్లు వాడుకోండని ఏపీలో ఆనాడు సీఎంగా ఉన్న KCR ప్రకటించారా?లేదా అని ప్రశ్నించారు.

News July 8, 2025

టెస్టుల్లో కొనసాగుతున్న సౌతాఫ్రికా జోరు

image

ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(WTC) గెలిచిన సౌతాఫ్రికా టెస్టుల్లో తన జోరు కొనసాగిస్తోంది. తాజాగా జింబాబ్వేను రెండో టెస్టులో చిత్తు చేసి వరుసగా 10వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ముల్డర్(367*) విజృంభణతో 626-5 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 170 రన్స్‌కి ఆలౌటైన జింబాబ్వే ఫాలోఆన్‌లో 220కే పరిమితమైంది. దీంతో ఇన్నింగ్స్ 236 రన్స్ తేడాతో SA భారీ విక్టరీ నమోదు చేసింది.