News March 18, 2024
విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన బీబీనగర్ మండల పరిధిలోని పెద్దపలువు తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిచ్యా అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలంవద్ద బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News April 8, 2025
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి

చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి ఏసీబీ వలలో చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సై అంతిరెడ్డి నార్కెట్‌పల్లిలో పనిచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
NLG: రైతులను వేధిస్తున్న సర్వేయర్ల కొరత

జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉండడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. సర్వేకు దరఖాస్తు చేసుకున్న బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ తగాదాలు తీరాలన్న.. గట్టు పంచాయతీలు వచ్చిన భూ సర్వే చేసి పరిష్కరిస్తారు. కాగా జిల్లాలో సర్వేయర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 8, 2025
నల్గొండ జిల్లాలో 40 డిగ్రీల దాటిన ఎండ !

నల్లగొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40.01 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.