News November 2, 2025
విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్ కు కాల్ చేయండి.!

ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని మొట్టమొదటగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లా వాసులు ఉదయం 10-12 గంటల మధ్య 89777 16661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చన్నారు. అలాగే 9133331912 నంబరుకు చాట్ ద్వారా కూడా సమస్యలు పంపవచ్చని కోరారు.
Similar News
News November 3, 2025
APPLY NOW: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://uoc.ac.inను సంప్రదించండి.
News November 3, 2025
SRSP UPDATE: 24 గంటల్లో 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. 16 స్పిల్ వే గేట్ల ద్వారా 47,060 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు.


