News March 5, 2026
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్

పొడవైన విద్యుత్ లైన్లలో(25 కి.మీ కంటే ఎక్కువ) విద్యుత్ సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించడానికి
ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు బిగిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. 33KV ఫీడర్లలో 775, 11KV ఫీడర్లలో 15352 ఇన్‌స్టాల్ చేశామన్నారు. లైన్లను జీఐఎస్ మ్యాప్పింగ్ 33 కేవీ 671 ఫీడర్లలో 14544 కిలో మీటర్లు,11 కేవీ 4471 ఫీడర్లలో 40572 కిలో మీటర్లు పూర్తి చేశామని చెప్పారు.
Similar News
News March 11, 2026
NTR: PG విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో పీజీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నానో టెక్నాలజీ మినహా మిగతా కోర్సుల పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1లోపు రూ.100 ఫైన్‌తో 2లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News March 11, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 11, 2026
మహబూబాబాద్: 10 రోజుల్లో 24 మంది మృతి!

గడ్డి మందు ప్రాణాలు తీస్తోంది. ఒకపక్క బ్యాన్ చేయాలని గొడవలు చేస్తుండగా, మరోపక్క ఆ మందు తాగి ఉసురు తీసుకుంటున్నారు. మహబూబాబాద్(D) కొత్తగూడ(M)లో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. మార్చి 1 నుంచి 10 వరకు కేవలం 10 రోజుల్లోనే మండల వ్యాప్తంగా 24 మంది మరణించినట్లు సమాచారం. 11 మంది గడ్డిమందు తాగి సూసైడ్ చేసుకోగా, మరో 13 మంది సాధారణ కారణాలతో మరణించినట్లు తెలుస్తోంది. వరుస సంతాప ఫ్లెక్సీలతో ప్రజలు భయపడుతున్నారు.


