News January 30, 2025

విద్య భవిష్యత్తును నేర్పిస్తుంది:గద్వాల DSP

image

జోగులాంబ: విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య అన్నారు. బుధవారం గట్టు మండల పరిధిలోని చాగదోనలో పాఠశాల సిబ్బంది ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతి చదివే విద్యార్థులకు సూచనలిచ్చారు. విద్య భవిష్యత్తును నేర్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఇష్టంతో చదవాలని అన్నారు.

Similar News

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

రాంపూర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నిర్మల్ ఎస్పీ

image

నర్సాపూర్(జి) మండలం రాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, మంగళవారం పరిశీలించారు. ఆమె ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్య డ్రైవింగ్ చేయొద్దని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు.

News November 4, 2025

పల్నాడు: అమర ప్రగతిని దత్తత తీసుకున్న అమెరికన్ దంపతులు

image

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ దత్తత సంస్థ సంరక్షణలో ఉన్న అమర ప్రగతి అనే బాలికను అమెరికాకు చెందిన మిస్టర్ బ్రాడెన్ రీజ్ వెబ్ దత్తత తీసుకున్నారు. కేంద్ర దత్తత వనరుల సంస్థ (CARA) పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తయింది. జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అంతర్జాతీయ దత్తత ఇదే కావడం విశేషం. కలెక్టర్ కృతికా శుక్లా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.