News February 26, 2025

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు: డీఎంహెచ్వో

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. NLG డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజూ పీహెచ్సీలకు వచ్చే రోగుల రక్తనమూనాలు సేకరించి తెలంగాణ హబ్‌కు పంపాలన్నారు.

Similar News

News February 26, 2025

నల్గొండ: గుండెపోటుతో వ్యక్తి మృతి

image

చండూరు మండలం నెర్మటలో పండుగ పూట తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో దోటి లింగయ్య (45) అనే వ్యక్తి మృతిచెందాడు. ఉదయం పొలం దగ్గరకు వెళ్లొచ్చాడని అంతలోనే ఛాతిలో నొప్పు వస్తుందని కుప్పకూలాడని గ్రామస్థులు తెలిపారు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News February 26, 2025

NLG: వెక్కిరిస్తున్న ఈ -పాలన! 

image

జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఈ-పాలన అటకెక్కింది. టీ ఫైబర్ పథకంలో భాగంగా ప్రతి పంచాయతీల్లో కేబుల్‌తో పాటు పరికరాలు బిగించి కనెక్షన్ ఇవ్వడం మరిచారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతీ పంచాయతీలో ఈ పాలన, ఇంటింటికి తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో 2017లో ప్రభుత్వం టి ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 

News February 26, 2025

10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!