News January 17, 2026
విధుల్లో చేరిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం ఉదయం విధుల్లో చేరారు. ఇవాళ తన కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. అద్దంకి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణులై 2009లో అద్దంకి ఎమ్మార్వోగా పనిచేసిన పులి శ్రీనివాసరావు పని చేశారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
Similar News
News February 19, 2026
అమెరికాలో సంతమాగులూరు యువకుడి అదృశ్యం.. నెలన్నర దాటినా వీడని మిస్టరీ!

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో అదృశ్యమైన సంతమాగులూరు మండలానికి చెందిన కారసాని హరికృష్ణారెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డిసెంబర్ 30 తర్వాత ఆయనతో సంబంధాలు తెగిపోవడంతో 50 రోజులుగా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో అమెరికా అధికారులతో సమన్వయం చేసుకుంటూ శోధన బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.
News February 19, 2026
అతి గొప్ప పురుషుడు ఎవరంటే?

తనలోని కోపాన్ని తానే జయించినవాడు అతి గొప్ప పురుషుడు అవుతాడని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ‘కోపం తనకే ప్రమాదకారి అని, అది తన మొదటి శత్రువని గుర్తించి, పాము తన ఒంటిపై ఉన్న కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా దానిని వదిలించుకోవాలి. కోపం వచ్చినప్పుడు పరీక్షించుకుని, మౌనం పాటించి ఆవేశాన్ని విడనాడేవాడే ఉత్తముడు. తనలోని ఉద్వేగాలను నియంత్రించుకోగలిగిన వాడే అందరికంటే శక్తిమంతుడు’ అని వివరించారు.
News February 19, 2026
చిత్తూరు: అంతా నాయకుల కనుసన్నల్లోనే.?

స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కౌండిన్య, నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందట. తెలిసినా అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొందట. కొందరు మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉంటున్నారట. గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన కొందరు నేతల పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తవణంపల్లె-పూతలపట్టు సరిహద్దులోని నీవా నది ఓ బడా నేత ఆక్రమణల ధాటికి మౌలిక స్వరూపమే కోల్పోతోందట. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


