News April 18, 2025
విధుల పట్ల శ్రద్ధ వహించాలి: సంగారెడ్డి ఎస్పీ

పోలీసు సిబ్బంది విధుల్లో పూర్తి నిబద్ధతతో పనిచేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. సంగారెడ్డిలోని పోలీసు కార్యాలయంలో ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ డివైస్‌పై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ తమ విధుల పట్ల శ్రద్ధ వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ పింకీ కుమారి ఉన్నారు.
Similar News
News December 17, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
*20 లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉన్నా: సీఎం CBN
*హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాలని కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
*సిడ్నీ ఉగ్రదాడి నిందితుడు సాజిద్‌ది హైదరాబాదే: TG డీజీపీ
*42% బీసీ రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క
*IPL: రూ.25.20 కోట్లకు గ్రీన్‌ను దక్కించుకున్న కేకేఆర్
News December 17, 2025
ఎల్లుండి గవర్నర్‌తో జగన్ భేటీ

AP: ఈ నెల 18న 4PMకు జగన్ గవర్నర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి <<18575709>>సంతకాల<<>> పత్రాలను అందజేస్తారని వైసీపీ తెలిపింది. అంతకుముందు 10AMకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సంతకాల పత్రాలు నిండిన వాహనాలను జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపిస్తారని వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సమావేశం అవుతారని వివరించింది.
News December 17, 2025
SRH మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఫైర్

IPL-2026 సీజన్‌కు SRH టీమ్‌లో స్టార్ బౌలర్లు లేరని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్ ఉన్నా వాళ్లు భారీగా రన్స్ సమర్పించుకునే వారేనని గుర్తుచేస్తున్నారు. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, అమిత్ కుమార్, శివమ్ మావిలకు అనుభవం లేదని గుర్తుచేస్తున్నారు. స్టార్ బౌలర్లు లేకుండా టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని మండిపడుతున్నారు.


