News June 17, 2024

విధేయతకే పట్టం

image

అత్యధిక మెజార్టీతో గెలిచి అందరినీ ఆకర్షించిన గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు ఇకపై ఏపీ TDP బాధ్యతలు మోయనున్నారు. YCP ప్రభుత్వంలో అనేక కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలిచారు. పార్టీ మారాలని ఒత్తిడి వచ్చినప్పటికీ TDPలోనే కొనసాగి విధేయతను చాటుకున్నారు. 7రోజులు ఆమరణదీక్ష చేసి స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి ఊపు తెచ్చిన పల్లా.. గాజువాక హౌస్ కమిటీ భూములు, అగనంపూడి టోల్ గేట్ సమస్యపై పోరాడారు.

Similar News

News March 26, 2026

విశాఖ: ‘రేపు మాంసం దుకాణాలు మూసివేయండి’

image

గ్రేటర్ విశాఖ పరిధిలో మార్చి 27న శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని జీవీఎంసీ ఆదేశించింది. మాంసం, చికెన్, చేపలు, రొయ్యల విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డా.ఈఎన్‌వి.నరేశ్ కుమార్ తెలిపారు. నగరంలోని జంతు వధశాలలు కూడా మూసివేయాలని సూచించారు. ఆదేశాలను అతిక్రమించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 26, 2026

విశాఖ: గ్రేటర్ విస్తరణలో 64 గ్రామాల భవిష్యత్తు ప్రశ్నార్థకం!

image

గ్రేటర్ విశాఖలో వార్డుల పునర్విభజనతో 120 డివిజన్లు ఏర్పాటవుతుండగా, విలీన ప్రతిపాదనల్లో ఉన్న 64 గ్రామాల భవిష్యత్తు చర్చనీయాంశమైంది. పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, భీమిలి మండలాల గ్రామాలను గ్రేటర్‌లో కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే గ్రామీణ పథకాలు కోల్పోయే అవకాశం, పన్నుల భారం పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి లాభాలు ఉన్నప్పటికీ ఈ మార్పులను స్వీకరిస్తారా అన్నది సందేహంగా మారింది.

News March 26, 2026

విశాఖ: ‘మాతృ మరణాలు జరగకుండా చూడాలి’

image

విశాఖ DMHO కార్యాలయంలో DMHO జగదీశ్వరరావు మాతృ మరణాలపై బుధవారం సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్యకేంద్రం, పీఎంపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలన్నారు., హైరిస్క్ గర్భిణిలు ప్రసవానికి వచ్చినప్పుడు కేజీహెచ్‌కి గానీ VGHకి గానీ రిఫర్ చేయాలని ఆయన సూచించారు. మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.