News March 12, 2025

వినయ్ చంద్‌కు అన్నమయ్య జిల్లా బాధ్యతలు

image

అన్నమయ్య జిల్లా ప్రత్యేకాధికారిగా వాడ్రేవు వినయ్ చంద్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు. మరోవైపు కడప జిల్లా ప్రత్యేక అధికారిగా సౌరభ్ గౌర్ నియమితులయ్యారు.

Similar News

News September 17, 2025

తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

image

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

News September 17, 2025

ASF: గంజాయి సాగు.. పదేళ్ల జైలు శిక్ష

image

గంజాయి సాగు చేసిన నిందితుడికి ASF జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాంకిడి ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాలు.. వాంకిడి మండలం సోనాపూర్‌కి చెందిన జంగు 2022లో అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జిల్లా కోర్టులో నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి రమేశ్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.

News September 17, 2025

హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

image

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్‌ పోలో‌తో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.