News August 27, 2025
వినాయక చవితికి పటిష్టమైన భద్రత: ఎస్పీ

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని జిల్లా ప్రజలను ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. ప్రజల జీవితాల్లో అన్ని శుభాలు కలగాలని, వారి కార్యాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News August 27, 2025
NLG: వినాయక చవితి పూజా పత్రికి డిమాండ్

వినాయక చవితి పూజా పత్రి విక్రయాలు ఉమ్మడి NLG జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. జిల్లా, మండల కేంద్రాల రైతుబజార్లు, రోడ్లపై రద్దీ ఉంది. మారేడు పత్రి, పచ్చిగరుక, మర్రి ఊడలు, కరక్కాయ, ఎలక్కాయలకు చాలా డిమాండ్ ఉంది. నైవేద్యంగా సమర్పించే పచ్చగూరలు, అరటి, చెరుకు కొమ్మలు కొంటున్నారు. పూల ధరలకూ రెక్కలొచ్చి బంతి, చామంతి, గులాబీ, లిల్లీ, లూజ్ పువ్వులకు డిమాండ్ పెరిగింది. వెదురు పాలవెల్లి, కలర్స్ పల్లకిలు ఉన్నాయి.
News August 27, 2025
రేపల్లె ఎక్స్‌ప్రెస్ మళ్లీ పాత షెడ్యూల్‌లోనే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న వర్క్‌ల కారణంగా కొంతకాలంగా చర్లపల్లి వరకు మాత్రమే నడుస్తున్న రేపల్లె ఎక్స్‌ప్రెస్ మళ్లీ పూర్తి రూట్‌లోనే నడవనుంది. సెప్టెంబర్ 10 నుంచి రైలు(17645) సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.40కు బయలుదేరి రేపల్లె చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రైలు(17646) రేపల్లె నుంచి బయలుదేరి గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుతుందని అధికారులు ప్రకటించారు.
News August 27, 2025
ఊర్కొండలో 65.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

గడచిన 24 గంటలలో నాగర్కర్నూల్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఉర్కొండ మండలంలో అత్యధికంగా 65.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. తాడూరులో 64.2, ఉప్పునుంతలలో 59.4, కల్వకుర్తిలో 56.4, వెల్దండలో 50.6, తిమ్మాజీపేటలో 61.8, బిజినేపల్లిలో 49.6, వంగూరులో 45.2, పెద్ద కొత్తపల్లిలో 45.2, తెలకపల్లిలో 43.6, పదరలో 44.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.