News August 21, 2025

వినాయక చవితి.. DJలకు అనుమతి లేదు: CP

image

వినాయక మండపాల వద్ద DJలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఆఫ్ చేయాలని సిద్దిపేట CP అనురాధ పేర్కొన్నారు. వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కరెంట్ కనెక్షన్ కోసం విద్యుత్ అధికారుల పర్మిషన్ తప్పనిసరి తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ పాటించాలని సూచించారు. ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, CC కెమెరాలు పెట్టుకోవాలన్నారు.

Similar News

News April 14, 2026

NZB: వేసవి ఉపశమనం.. ఉపాధికి ఊతం

image

ఎండలు మండిపోతుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత తీవ్రమైంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎయిర్ కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్‌లో కొత్త కూలర్ల విక్రయాలు జోరందుకున్నాయి. పాత కూలర్లను బాగు చేయించేందుకు జనం దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈ సీజన్ కారణంగా అటు విక్రయదారులు, ఇటు మరమ్మతుల ద్వారా మెకానిక్‌లకు చేతినిండా పని దొరుకుతూ ఉపాధి పొందుతున్నారు.

News April 14, 2026

భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2026

850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

image

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.