News September 5, 2025
వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సీపీ సమీక్ష

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 6న జరగనున్న గణపతి నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజతో పాటు ఇతర ఏసీపీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 7, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117, మాంసం రూ.170 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.193 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 7, 2025
చంద్రగ్రహణం.. ఒంటిమిట్ట ఆలయం మూసివేత

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే కడప జిల్లాలోని పలు ఆలయాలు పొలతల మల్లేశ్వరస్వామి, పులివెందులలోని వెంకటేశ్వర స్వామి, మిట్ట మల్లేశ్వరస్వామి, రంగనాథస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం మూసివేయనున్నట్లు గండి EO వెంకటసుబ్బయ్య తెలిపారు.
News September 7, 2025
రూ.350 కోట్లతో భద్రాచలం రాములోరి ఆలయాభివృద్ధి

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఆలయ పరిసరాలను 4 విడతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలి విడతగా రూ.115 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ తదితర అభివృద్ధి, రెండో విడత రూ.35 కోట్లతో రోడ్లు కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, మూడో విడతలో రూ.100 కోట్లతో పార్కులు, నాలుగో విడతలో రూ.100 కోట్లతో హోటల్ తదితర పనులు చేపట్టనున్నారు.