News September 2, 2025
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా SP రాజేష్ చంద్ర కామారెడ్డి టేక్రియాల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలను నివారించడానికి గజ ఈతగాళ్ళు, రెస్క్యూ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వెంట ASP చైతన్య రెడ్డి ఉన్నారు.
Similar News
News September 2, 2025
స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖలు పనిచేయాలి: కలెక్టర్

స్వయం సహాయక సభ్యులు, రైతు సంఘాల సభ్యులకు సుస్థిరమైన జీవనోపాధి, స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులు పని చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలన్నారు. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 2, 2025
జియో, ఎయిర్‌టెల్.. మీకూ ఇలా అవుతోందా?

జియో, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ రాక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఒకప్పటి రోజులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకచోటే సిగ్నల్ ఉండటం, అక్కడే నిలబడి ఫోన్ వాడటం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వీడియోలేమో ‘లోడింగ్.. లోడింగ్’ అంటున్నాయి. గ్రామాలను పక్కనపెడితే హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఫోన్లు కలవడం లేదని చాలామంది వాపోతున్నారు. మీరేమంటారు?
News September 2, 2025
ఈనెల 9 నుంచి రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ క్రీడలు: DYSO

రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులు ఈ నెల 5లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా క్రీడలు, యువజన అధికారి జంగపల్లి వెంకట నర్సయ్య తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో రాష్ట్ర జట్ల ఎంపికలను ఈనెల 9, 10న హైదరాబాద్‌లోని వివిధ స్టేడియాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.